మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిల ప్రియ ఆరోపించే ఆ కోవర్టును తానేనని, తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఆళ్లగడ్డ సీటు గురించి చంద్రబాబు చెవిలో చెప్పారని అఖిలప్రియ చెప్పడం విడ్డూరంగా వుందని సుబ్బారెడ్డి దుయ్యబట్టారు.

మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిల ప్రియ ఆరోపించే ఆ కోవర్టును తానేనని, తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఆళ్లగడ్డ సీటు గురించి చంద్రబాబు చెవిలో చెప్పారని అఖిలప్రియ చెప్పడం విడ్డూరంగా వుందని సుబ్బారెడ్డి దుయ్యబట్టారు. ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలని తనకు ఎప్పటి నుంచో ఆసక్తిగా వుందని, పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుంచి పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పార్టీపై వున్న గౌరవంతోనే ఆళ్లగడ్డ సభకు వెళ్లలేదని, అంతే తప్పించి భయపడి కాదని సుబ్బారెడ్డి వెల్లడించారు. అఖిలప్రియ అల్టీమేటాలకు, బెదిరింపులకు తాను భయపడే రకం కాదన్నారు. సమిష్టి కృషి వల్లనే ఆళ్లగడ్డలో చంద్రబాబు నాయుడు సభ విజయవంతం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. ముస్లింలను కించపరుస్తూ మాట్లాడిన శిల్పామోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఏవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.