ఈరోజు టెక్కలి నియోజకవర్గం అచ్చం నాయుడి నియోజకవర్గంలో కోటబొమ్మాళి వైస్సార్సీపీ కార్యాలయంలో వైయస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు దాడి

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ వర్గం రెచ్చిపోయింది. వైసిపి పార్టీకి చెందిన కార్యకర్తలపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తలు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కోటబొమ్మాళి మండల వైఎస్సార్ సీపీ కార్యాలయంపై గురువారం ఉదయం టీడీపీ నేత బోయిన రమేష్‌ ఆధ్వర్యంలో దాడి చేశారు.

ముందుగా పార్టీ కార్యాలయంలోకి దూసుకు వెళ్లి... ఫర్నిచర్‌తో పాటు కొన్ని ఫైల్స్ ధ్వంసం చేశారు. ఇదేమని ప్రశ్నించినందుకు వైఎస్సార్ కార్యకర్తలపై కర్రలు, ఐరన్‌ రాడ్లుతో దాడి చేశారు. దొరికిన వారిని దొరికినట్లు విచక్షణారహితంగా రక్తం వచ్చేలా కొట‍్టారు. ఈ దాడిలో సుమారు 120మంది పాల్గొన్నట్లు వైసీపి కార్యకర్తలు చెప్పుకొచ్చారు.

దాడిలో గాయపడ్డ కార్యకర్తలు :

  • నేతింటి నగేష్
  • బోయిన నాగేశ్వరరావు
  • అన్నెపు రామారావు
  • బుబ్బ వెంకటరావు
  • కొర్ల ఆదినారాయణ
  • పాతుల శ్యామలరావు

"