వైసీపీ గాలికి పుట్టిని పార్టీ అని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. సీఎం జగన్ రాజకీయాల కోసం చిన్నాన్నను చంపి లబ్దిపొందారని ఆరోపించారు.

వైసీపీ గాలికి పుట్టిని పార్టీ అని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. సీఎం జగన్ రాజకీయాల కోసం చిన్నాన్నను చంపి లబ్దిపొందారని ఆరోపించారు. జగన్ మాటలు నమ్మి ఓట్లేశారని అన్నారు. పదవుల కోసం జగన్ ఏమైనా చేస్తాడని విమర్శించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో సీబీఐ విచారణలో తెలుస్తోందని అన్నారు. కడపలో జరుగుతున్న జోన్-5 టీడీపీ సమీక్ష సమావేశంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైసీపీలాగా టీడీపీ గాలికి పెట్టిన పార్టీ కాదని.. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అని అన్నారు. టీడీపీని దెబ్బతీయడం జగన్ తండ్రి వల్లే కాలేదని అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఉండకూదని ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా జగన్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. 

ఏపీని వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. వచ్చే ఎన్నికలకు టీడీపీ శ్రేణులు అందరూ సమిష్టింగా పనిచేయాలని సూచించారు. దుష్టుల కుట్రలను టీడీపీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.