టీడీపీ కౌన్సిలర్ అభ్యర్ధులను బెదిరించి వైసీపీలో చేర్చుకున్నారంటూ తెలుగుదేశం నేత కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పలాసలో వైసీపీ దురాగతాలు సాగనివ్వమంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

టీడీపీ కౌన్సిలర్ అభ్యర్ధులను బెదిరించి వైసీపీలో చేర్చుకున్నారంటూ తెలుగుదేశం నేత కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పలాసలో వైసీపీ దురాగతాలు సాగనివ్వమంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దాని ప్రకారం... ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎన్నికలను అధికార బలంతో దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నించడం అత్యంత నీచం. ప్రజల్లోకి వెళ్తే చిరిగిన రబ్బర్ చెప్పులు తడిపి, పేడలో ముంచి వైసీపీ అభ్యర్ధుల్ని తరిమి కొట్టడం ఖాయం. అందుకే ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక తెలుగుదేశం పార్టీ తరఫున పలాస మున్సిపల్ కార్పొరేషన్ కు నామినేషన్ వేసిన కౌన్సిలర్లను బెదిరించి, భయపెట్టి, బలవంతంగా వైసీపీలో చేర్చుకోవడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు.

పలాసలో వైసీపీ నేతలు, మంత్రి అప్పలరాజు చేస్తున్న అరాచకాలను ప్రజలు గుర్తించారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులను, వైసీపీ నేతల్ని పలాస జీడి ఫ్యాక్టరీల్లోని చెత్త కంటే దారుణంగా తీసి పక్కన పడేయనున్నారు. అధికార మదం, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఏకపక్షాల చేసుకునేందుకు, నామినేషన్లు ఉపసహరించుకునేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 

ఇది ముమ్మాటికీ వైసీపీ దురాగతానికి, నీతిమాలిన రాజకీయాలకు నిదర్శనం. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను తట్టుకునే ధైర్యం లేక టీడీపీ అభ్యర్ధులను బెదిరింపులతో ప్రలోభాలతో లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధే అజెండాగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్తుంటే.. అక్రమాలు అరాచకాలే అజెండాగా వైసీపీ నేతలు ఎన్నికలకు వెళ్తున్నారు. జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా గెలుపు అసాధ్యమని గుర్తుంచుకోవాలని ఈ ప్రకటనలో తెలిపారు.