విశాఖ గర్జన ఎవరికి ఇష్టం లేదని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలకే మూడు రాజధానులని అంటున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి ఒక ఫేక్ మఖ్యమంత్రి అని విమర్శించారు.
విశాఖ గర్జన ఎవరికి ఇష్టం లేదని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలకే మూడు రాజధానులని అంటున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి ఒక ఫేక్ మఖ్యమంత్రి అని విమర్శించారు. నలుగురు రెడ్లు ఏపీని దోచుకుంటున్నారని ఆరోపించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో విశాఖపట్నంలో టీడీపీ ఏర్పాటు చేసిన రౌండ్ సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సీఎం జగన్ నోరు విప్పితే అబద్దం తప్ప.. ఒక్కటి కూడా వాస్తవం మాట్లాడిన సందర్భం లేదన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబుపై నమ్మకంతో ప్రజలు టీడీపీకి అధికారం ఇచ్చారని అన్నారు. 2014-2019 టీడీపీ పాలనలో ఏపీకి సువర్ణ అధ్యాయం అని అన్నారు. ఆదాయం, రాజధాని లేకపోయినప్పటికీ.. ఆలోచనతో సంక్షేమాన్ని, అభివృద్దిని సమాంతరంగా అన్ని జిల్లాలకు ఇచ్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ఆ విషయాన్ని తాము ప్రజానీకానికి చెప్పుకోలేకపోయామని అన్నారు. అదే సమయంలో వైసీపీ పేటీఎం బ్యాబ్.. ప్రజలకు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఏ సర్వే చేసిన సరే.. టీడీపీకి 150 సీట్లు వస్తాయని చెబుతున్నారని అన్నారు. దీంతో పరిస్థితి చేజారి పోయిందని భావించిన వైఎస్ జగన్.. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడానికే మూడు రాజధానుల పేరుతో డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు. పరిపాలన వికేంద్రీకరణకు ఆరాధ్యుడు ఎన్టీఆర్ అని అన్నారు. తర్వాత ప్రజల వద్దకు పాలన, జన్మభూమి పేరుతో ప్రజలకు అందుబాటులో చేసింది చంద్రబాబు నాయుడని అన్నారు. ఈ రోజు జగన్ చేసేది విధ్వంసం అని మండిపడ్డారు. ఏపీ ఒకటే రాజధాని అనేది.. తెలుగుదేశం పార్టీ నినాదం అని స్పష్టం చేశారు.
