Asianet News TeluguAsianet News Telugu

ఏసీబీ కార్యాలయానికి అచ్చెన్నాయుడు.. ఏం జరుగుతుందో చూద్దామంటూ వ్యాఖ్యలు (వీడియో)

ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో అదుపులోకి తీసుకున్న టీడీపీ నేత, మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడిని విజయవాడ గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. 

tdp leader atchannaidu comments at acb office vijayawada
Author
Hyderabad, First Published Jun 12, 2020, 7:38 PM IST

ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో అదుపులోకి తీసుకున్న టీడీపీ నేత, మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడిని విజయవాడ గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. మరికాసేపట్లో ఆయనను జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు.

ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియకుండా అచ్చెన్నాయుడు కొన్ని ప్రక్రియలు చేశారని, రూ.150 కోట్ల వరకు అక్రమాలు జరిగాయని ఏసీబీ గుర్తించింది. రూ.988 కోట్ల రూపాయల కొనుగోళ్లలో అచ్చెన్నాయుడు పాత్ర వుందని అధికారులు నిర్ధారించారు.

వీడియో

మందులు, ల్యాబ్ పరికరాల కొనుగోలు టెండరింగ్‌లో మాజీ మంత్రి కుమారుడి పాత్ర వుందని తెలుస్తోంది. ఈ కేసులో అచ్చెన్నాయుడి కుటుంబసభ్యులను సైతం ఏసీబీ ప్రశ్నించే అవకాశం వుంది.

రమ్మంటే ఏసీబీ కార్యాలయానికి వచ్చానని.. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది పడలేదని అచ్చెన్నాయుడు ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లేముందు అన్నారు. ఏం జరుగుతుందో చూద్దామని ఆయన వ్యాఖ్యానించారు.

Follow Us:
Download App:
  • android
  • ios