Asianet News TeluguAsianet News Telugu

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీ చట్టంపై రాజ్యసభలో నేడు చర్చ

 ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హమీ చట్టంపై మంగళవారం నాడు మధ్యాహ్నం రెండున్నర గంటలకు రాజ్యసభలో స్పల్పకాలిక చర్చ జరగనుంది.  టీడీపీ ,వైసీపీ ఎంపీలు ఇచ్చిన నోటీసుపై ఈ చర్చ జరగనుంది.

TDP keeps Andhra issue alive; Rajya Sabha to debate today

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హమీ చట్టంపై మంగళవారం నాడు మధ్యాహ్నం రెండున్నర గంటలకు రాజ్యసభలో స్పల్పకాలిక చర్చ జరగనుంది.  టీడీపీ ,వైసీపీ ఎంపీలు ఇచ్చిన నోటీసుపై ఈ చర్చ జరగనుంది.

బీఏసీ సమావేశంలో సోమవారం నాడే ఈ అంశంపై చర్చించాలని భావించారు. కానీ,ఇతరత్రా కారణాలతో ఈ చర్చను మంగళవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. 

ఏపీ విభజన చట్టంపై  రాజ్యసభలో  చర్చను టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి ప్రారంభించనున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున సీఎం రమేష్‌, కనకమేడల.. గరికపాటి రామ్మోహన్‌రావు, టీజీ వెంకటేష్‌, తోట సీతారామలక్ష్మీ చర్చలో పాల్గొంటారు.

కాంగ్రెస్‌ తరపున కేవీపీ రామచంద్రరావు చర్చలో పాల్గొననున్నారు. బీజేపీ తరపున జీవీఎల్ నరసింహారావు, వైసీపీ తరపున విజయసాయిరెడ్డి చర్చలో పాల్గొనున్నారు. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హమీ చట్టంలో పొందుపర్చిన హమీలను అమలు చేయాలని  టీడీపీ  డిమాండ్ చేస్తోంది.ఈ డిమాండ్లను అమలు చేయనందుకు నిరసనగా  ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చింది.

ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన తర్వాత  కేంద్రంపై  అవిశ్వాసాన్ని ప్రతిపాదించింది.ఈ అవిశ్వాసంపై ఈ నెల 20వ తేదీన లోక్‌సభలో చర్చ జరిగింది. అయితే ఎన్డీఏకు బలం ఉన్నందున అవిశ్వాసం వీగిపోయింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios