Asianet News TeluguAsianet News Telugu

తమ్ముళ్లు...పెరుగుతున్న బాకీలు

జాతీయ స్ధాయిలో కొందరు, రాష్ట్ర స్ధాయిలో కొందరు  నేతలు పెరిగిపోతున్నందువల్లే బ్యాంకుల్లో రానిబాకీలు పెరిగిపోతున్నాయి.

TDP haven for defaulters

పదవులను, అధికారాన్ని అడ్డు పెట్టుకుని బ్యాంకులు, ఆర్ధిక సంస్ధల్లో వందల కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవటం తర్వాత ఎగ్గొటటం రివాజుగా మారిపోయింది. రాష్ట్రానికి సంబంధించి ఇపుడు అదే విషయం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మంత్రి గంట శ్రీనివాస్ రావు ఆస్తులను ఇండియన్ బ్యాంకు స్వాధీనం చేసుకోవటం సంచలనంగా మారింది.

 

ఇపుడంటే గంటా ఆస్తులను బ్యాంకు స్వాధీనం చేసుకున్నది. టిడిపి నుండే కేంద్రంలో మంత్రిగా ఉన్న సుజనా చౌదరి ఎగొట్టిన బకాయిల విషయం న్యాయస్ధానంలో ఎప్పటి నుండో నలుగుతోంది. రూ. 100 కోట్  అప్పు ఎగొట్టిన విషయమై మంత్రి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

 

పై ఇద్దరే కాదు భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి శాంబశివరావు, టిడిపి ఎంపి రాయపాటి సాంబ శివరావుల కథ కూడా అదే. కావూరి బకాయిలు విషయంలో అయితే, బకాయిల వసూళ్ళకు ఆయనకు అప్పులిచ్చిన బ్యాంకు సిబ్బంది ఏకంగా కావూరి ఇంటి ముందే ధర్నా కూడా చేసారు.

 

బయటపడింది కేవలం వీరు మత్రమే. నేతలు ఏ పార్టీలో ఉన్నా సరే వారి పద్దతి మాత్రం ఒక్కటే. అందుకనే వీలున్నంత వరకూ రాజకీయ నేతలు తాము చేస్తున్న వ్యాపారాల్లో ముందు జాగ్రత్తగా ఇతర పార్టీల నేతలను భాగస్ధులుగా కలుపుకుంటారు. అన్నీ కుదిరితే ఏకంగా వియ్యమే అందుకుంటారు. అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్న పవర్ మాత్రం తమ ఇల్లు దాటిపోకూడదన్నదే వారి ఆలోచన.

 

రాజకీయాలు మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతున్నపుడు ఎవరిని అనీ ఉపయోగం లేదు. శక్తి కొద్దీ.. జాతీయ స్ధాయిలో కొందరు, రాష్ట్ర స్ధాయిలో కొందరు  నేతలు పెరిగిపోతున్నందువల్లే బ్యాంకుల్లో రానిబాకీలు పెరిగిపోతున్నాయి. అంటే అర్ధం ఏమిటి? ప్రత్యక్షంగా బ్యాంకులను పరోక్షంగా ప్రజలను ముంచుతున్నారనే.

Follow Us:
Download App:
  • android
  • ios