ఉమ్మడి తూర్పుగోదావరిల్లో టీడీపీ అభ్యర్థులు వీరే.. జనసేనకు ఎన్ని సీట్లంటే...?

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. టీడీపీ-బీజేపీ పొత్తు విషయంలో క్లారిటీ ఇంకా రాలేదు. కానీ ఇప్పటికే పొత్తులో ఉన్న జనసేనతో కలిసి అభ్యర్థులను ప్రకటిస్తోంది. 

TDP has announced its candidates in the joint East Godavari - bsb

ఉమ్మడి తూర్పు గోదావరి : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే వైసీపీ 60కి పైగా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా.. టిడిపి రెండు స్థానాల్లో,  జనసేన రెండు స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టిడిపి 10 స్థానాల్లో అభ్యర్థులపై స్పష్టతనిచ్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మొత్తం 19 అసెంబ్లీ స్థానాల్లో ఇంకా ఆరు స్థానాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉందని సమాచారం. 

క్లారిటీ వచ్చిన పదిమంది అభ్యర్థుల్లో.. 
తుని నుంచి టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య,  
ప్రత్తిపాడు నియోజకవర్గంలో వరపుల సత్య ప్రభ
పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప
కొత్తపేటలో బండారు సత్యానందరావు, దాట్ల సుబ్బరాజు
అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణ 
మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు
జగ్గంపేటలో  జ్యోతుల నెహ్రు
రాజమండ్రి రూరల్ లో గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు కరారయ్యారు.  
ఇక రాజమండ్రి అర్బన్ లో  గత ఎన్నికల్లో  టిడిపి సీనియర్ నేత ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవాని గెలిచారు. దీంతో ఇక్కడి సీటుఆదిరెడ్డి కుటుంబానికి ఖరారు అయినట్టుగా తెలుస్తోంది.  అయితే ఆదిరెడ్డి భవాని కాకుండా ఈసారి ఆమె భర్త ఆదిరెడ్డి వాసు పోటీ చేయాలని అనుకున్నాడట.  దీనికి టిడిపి అధిష్టానం కూడా మొదట్లో ఒప్పుకుంది కానీ సర్వేల్లో దీనికి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయట.

AP Politics: హీటెక్కుతోన్న ఏపీ రాజకీయం.. ఎన్నికల బరిలోకి కొత్త నేతలు.. !

ఆదిరెడ్డి భవానీ వైపే ఎక్కువమంది ఇష్టం వ్యక్తం చేశారు. దీంతో టికెట్టు ఆ కుటుంబంలో ఎవరికి ఇవ్వాలనే దానిమీద పునరాలోచన చేస్తున్నారని సమాచారం.  ఇక టిడిపితో పొత్తులో ఉన్న జనసేనకు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్ మొత్తం మూడు సీట్లను కేటాయించినారని అధికారిక వర్గాల సమాచారం.

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అంతకుముందే రాజానగరం రాజోలు సీట్లలో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూడు సీట్లతో పాటు మరో రెండు సీట్లు కూడా జిల్లాలో తమకు కేటాయించాలని జనసేన ఆశిస్తోందట. అందులో టిడిపి మాజీ ఎమ్మెల్యే బలమైన అభ్యర్థిగా ఉన్న పిఠాపురం కూడా ఒకటి.  ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మ బలంగా ఉన్నారు. దీంతో ఇప్పుడు ఈ  స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే దానిమీద ఆసక్తి నెలకొంది.

ఈ రెండు స్థానాలు ఇలా ఉండగా, మరో ఐదు సీట్లపై కూడా టిడిపి కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. అందులో రామచంద్రాపురం కూడా ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో వాసంశెట్టి సుభాష్, రెడ్డి సుబ్రహ్మణ్యం, డాక్టర్ కాడ వెంకటరమణ,  కుడిపూడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, రెడ్డి అనంత కుమారి, మేడిశెట్టి సత్యనారాయణలు పోటీలో ఉన్నారట. 

అమలాపురంలో కూడా ఇలాగే ఉంది. ఈ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే ఆనందరావు వైపు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ, మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు కూతురు సత్యశ్రీ పేరు కూడా  ఈ స్థానం నుంచి పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సత్యశ్రీని అమలాపురంలో కాకుండా పి గన్నవరం (ఎస్సీ)కి పరిశీలిస్తున్నారట. కాగా, ఇక్కడ సత్య శ్రీతో పాటు గంటి హరీష్, మోకాబాల గణపతి, మహాసేన రాజేష్, మోకా ఆనంద సాగర్ పేర్ల కూడా  అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

రంపచోడవరంలో మాజీ ఎమ్మెల్యే పంతల రాజేశ్వరి, సున్నం వెంకటరమణ, శిరీషాదేవి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక కాకినాడ అర్బన్ పై ఇంకా క్లారిటీ రానట్టుగా తెలుస్తోంది. ఇక్కడి నుంచి టిడిపి అభ్యర్థులుగా వనమాడి సుస్మిత, పెనుబోతు తాతారావు, వనమాడి వెంకటేశ్వరరావు, గుర్రం చంద్రమౌళి పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా వినిపిస్తున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios