అమరావతి: రాష్ట్రంలో కూరగాయల ధరలు పెరగడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకాశాన్ని అంటిన ధరలతో సామాన్యులు ఏం కొనేటట్లు లేరంటూ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.  

ప్రతి అక్కకీ, ప్రతి చెల్లికీ చెప్పండి సీఎం జగన్ పెంచుకుంటూ పోతున్నారు. ఉల్లి కోయకుండానే తమ అక్కాచెల్లెళ్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంచి కూరగాయలకు బస్తా డబ్బులు పట్టికెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ మండిపడ్డారు. 

కూరగాయల ధరలు నియంత్రించడంలో వైసీపీ ప్రభుత్వం ఘెరంగా విఫలం చెందినట్లు ఆరోపించారు. 45 ఏళ్లకే మహిళలకు పెన్షన్ అని మోసం చేశారు. ఇప్పుడు కనీసం కూరగాయలు కొనుక్కోలేని పరిస్థితి తీసుకొచ్చారు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. 

అప్పో, సొప్పో పూట గడుపుకుందామనుకుంటే సంచి కూరగాయలు రావాలి అంటే బస్తా డబ్బులు పట్టికెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కూరగాయల ధరలు నియంత్రించడంలో విఫలమైన ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని నారా లోకేష్ సూచించారు.