అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇసుక సునామీ సృష్టిస్తోంది. గత కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాలన్నీ ఇసుక చుట్టూనే తిరుగుతున్నాయి. ఇసుక అందిస్తున్నామని ప్రభుత్వం లేదు అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

ఇకపోతే ఇసుకదొరక్కపోవడంతో ఇటీవలే ఒక భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్యకు సైతం పాల్పడిన సంగతి తెలిసిందే. నవంబర్ 3న జనసేన పార్టీ విశాఖపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో బుధవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఒక్కరోజు దీక్షకు దిగనున్నారు. 

గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదురుగా నిరసన దీక్ష చేయనున్నారు నారా లోకేష్. ఇసుక కొరతను నిరసిస్తూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నారా లోకేష్ దీక్ష చేయనున్నారు. 

ఇప్పటికే ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ సమర శంఖారావం పూరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు నిరసన తెలిపింది తెలుగుదేశం పార్టీ. ర్యాలీలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

ఇకపోతే నారా లోకేష్ అయితే ట్విట్టర్ వేదికగా ప్రభుత్వం వైఖరిపై విరుచుకుపడుతున్నారు. ఇసుకదొరక్క ప్రజలు కష్టాలు పడుతుంటే ప్రభుత్వం మెుండివైఖరితో ముందుకు వెళ్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. 

ఇకపోతే నారా లోకేష్ దీక్షకు సంబంధించి పోలీసుల అనుమతి తీసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించారు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇకపోతే కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షకు సంబంధించి ఏర్పాట్లను సైతం టీడీపీ నేతలు చేస్తున్నారు.