అమరావతి: విశాఖలో తనను పర్యటించకుండా అడ్డుకోవడంపై కోర్టుకు వెళ్లనున్నట్టు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రకటించారు.

గురువారం నాడు ప్రజా చైతన్య యాత్రలో బాబు పాల్గోనేందుకు వెళ్లిన సమయంలో  వైసీపీ శ్రేణులు  ఆయనను అడ్డుకొన్నారు. దీంతో   సుమారు నాలుగు గంటలకు పైగా బాబు కారులోనే విశాఖ ఎయిర్ పోర్టులోనే ఉన్నారు.

Also read:పంతం నెగ్గించుకున్న పోలీసులు: ఎట్టకేలకు ఫ్లైటెక్కిన చంద్రబాబు

ఆ తర్వాత చంద్రబాబునాయుడును  పోలీసుల అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనను వీఐపీ లాంజ్‌లో ఉంచారు. పోలీసులు చంద్రబాబును వెనక్కి పంపారు. గురువారం రాత్రి చంద్రబాబునాయుడు విశాఖపట్టణం నుండి హైద్రాబాద్ కు చేరుకొన్నారు. 

ఈ ఘటనపై చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు స్పందించారు.విశాఖలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కోర్టుకు వెళ్లనున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. 
పోలీసుల తీరు అభ్యంతరంగా ఉందని బాబు మండిపడ్డారు.  పోలీసుల సహకారం లేకుండా వైసీపీ కార్యకర్తలు ఎలా ఎయిర్ పోర్టుకు వచ్చారని ఆయన ప్రశ్నించారు.

తన కాన్వాయ్ పై దాడికి దిగినవారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని బాబు ప్రశ్నించారు. విశాఖలో పర్యటించి తీరుతానని  బాబు స్పష్టం చేశారు.  ఎన్నిసార్లు తనను ఆపుతారో చూస్తానని బాబు ప్రకటించారు. 

 

ఈ విషయమై