అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించిన మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. జేసీ మాటలను ఎవరూ సీరియస్ గా తీసుకోరంటూ చెప్పుకొచ్చారు. 

ఎవరు సీఎంగా ఉంటే వారికి భజన చేయడం జేసీకి అలవాటేనని చెప్పుకొచ్చారు. రాజకీయ పదవుల్లో మినహా ఆయనకు ప్రజల్లో పట్టులేదంటూ తిట్టిపోశారు. గతంలో అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పై మాజీ ఎంపీ జేసీదివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయనను పొగిడి వైయస్ జగన్ ను విమర్శించారని ఇప్పుడు జగన్ సీఎం కావడంతో ఆయనను పొగుడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఆయనకు అలవాటేనని ప్రజలు పెద్దగా పట్టించుకోరని తెలిపారు. ఇకపోతే ఫ్యాక్షనిస్టులకు గన్‌మెన్లను ఉపసంహరించి జగన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రభాకర్ చౌదరి సవాల్ విసిరారు.

ఈ వార్తలు కూడా చదవండి

వంద రోజుల పాలనకు వంద మార్కులు: జగన్‌పై జేసీ ప్రశంసలు