Asianet News TeluguAsianet News Telugu

ఆల్కహాల్ గురించి పోస్ట్: వావి వారసలపై నెటిజన్‌తో అనిత ట్వీట్ల యుద్ధం

మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఫైర్ బ్రాండ్ వంగలపూడి అనిత నెటిజన్లపై విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేధం, మద్యం అమ్మకాలపై విమర్శలు చేస్తూ అనిత ట్వీట్ చేశారు

tdp ex mla anitha strong counter to netizen on twitter
Author
Amaravathi, First Published Jul 28, 2020, 2:34 PM IST

మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఫైర్ బ్రాండ్ వంగలపూడి అనిత నెటిజన్లపై విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేధం, మద్యం అమ్మకాలపై విమర్శలు చేస్తూ అనిత ట్వీట్ చేశారు. ఈ క్రమంలో నెటిజన్ స్పందిస్తూ.. ఆంటీకి మందు అలవాటు ఉందని అందుకే ఆల్కహాల్ గురించి వివరిస్తోందంటూ విమర్శలు చేశాడు.

 

 

దీనిపై స్పందించిన అనిత గట్టి కౌంటరిచ్చారు. ‘‘  ‘అవును తమ్ముడు... మీ అమ్మగారు, నేను కలిసే తాగుతాం.. మీ అమ్మ హాఫ్ తాగితే... నేను క్వార్టర్ తాగుతాను. సన్నాసీ ఏం భాషరా ఇది. ఇలానే పెంచారా నిన్ను మీ ఇంట్లో. సంస్కారం లేని వెధవ పుట్టాడని ప్రతిరోజూ ఏడుస్తారు’ అంటూ అనిత ట్వీట్ చేశారు.

 

 

ఆమె సమాధానంతో సదరు  నెటిజన్ మళ్లీ స్పందించాడు. ‘ నిన్ను ఎలా పెంచారో నన్ను అలాగే పెంచారు అక్క. బట్ నీవు బొత్తిగా మేనస్ లేకుండా పోస్టులు పెడుతున్నావు. అప్పుడు నిన్ను పెంచడంలో తప్పు ఉందా నన్ను పెంచడంలో తప్పు ఉందో జస్ట్ థింకింగ్ అంటూ’ రిప్లే ఇచ్చాడు. దీనికి మళ్లీ అనిత స్పందించారు.

‘అదిగో అందుకే మీ అమ్మగారు బాధపడేది... manas కాదు manners... అటు చదువు లేక, ఇటు సంస్కారం లేక ఎలా బ్రతుకుతావో అనే ఆవిడ బాధ...వెళ్ళు తమ్ముడు కనీసం ఐదు పాస్ అవ్వు...ఎన్నాళ్ళు బస్ బోర్డ్ కూడా పక్కోడితో చదివించుకుంటావు’ అంటూ మరో రిప్లై ఇచ్చారు.

 

 

తన కన్నా వయసులో చిన్నోడు కాబట్టే తమ్ముడు అని పిలిచా అన్న అనిత.. అరెయ్, తోరేయ్ అని పిలవలేదని అడిగారు. తమ్ముడు అంటే వావి వరసలు లేనట్ట అని ఆమె ప్రశ్నించారు. మరీ రాజన్న, జగనన్న అంటే అర్థం ఏమిటీ అని అడిగారు. తండ్రి కొడుకులను అన్న అని పిలుస్తారా..? ఇవేం వావి వరసలు అని నిలదీశారు.

 

 

అమ్మ ఎవరికైనా అమ్మే.. నేను ఇద్దరి పిల్లలకు తల్లినేనని చెప్పారు అమ్మ. అందరీ అమ్మలను గౌరవించాల్సినదే తన అభిప్రాయం అని స్పష్టంచేశారు. అసెంబ్లీ లోనే అమ్మ టాపిక్ తెచ్చినవారిని దేవుడనే వాళ్ళు అమ్మ గురించి నీతులు చెప్పొచ్చా? నేను అమ్మ టాపిక్ తెచ్చానని ఇంత రియాక్ట్ అవుతున్నారే.

మరి నా బిడ్డలు,నా కుటుంబం మీరు అసభ్యంగా మాట్లాడేది చూస్తే బాధపడరా?? వాళ్ళ బాధ బాధ కాదా? అవి బాధ అనిపించవా? అప్పుడు ఎక్కడున్నారు? చల్ హఠ్ అంటూ ట్వీట్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios