విజయవాడ: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్టయిన టీడీపీ నేత, తాడి పత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. తన భర్త జేసీ ప్రభాకర్ రెడ్డికి, తన కుమారుడు అస్మిత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని, అక్రమంగా అరెస్టు చేసిందని ఆమె తన పిటిషన్ లో ఆరోపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్ పై హైకోర్టు బెంచ్ సోమవారం విచారణ చేపట్టనుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. 

Also Read: జేసీ ప్రభాకర్ రెడ్డికి షాక్... బెయిల్ నిరాకరణ

కోర్టు ఆదేశాలతో పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని, అస్మిత్ రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు వారిని పోలీసులు విచారిస్తారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెడుతారు. కడప సెంట్రల్ జైలులో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డిని, అస్మిత్ రెడ్డిని అనంతపురం పోలీసులు విచారిస్తు్నారు. 

వారిద్దరిని ఈ నెల 13వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. వారిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిద్దరిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు.

Also Read: పోలీసు కస్టడీకి జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి: ఒంటి గంట నుంచి విచారణ

154 బస్సులకు సంబంధించి నకిలీ ఎన్ఓసీలు సృష్టించారనే ఆరోపణపై పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని, అస్మిత్ రెడ్డిని హైదరాబాదులో అరెస్టు చేసి, అనంతపురం తరలించారు నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్ మీద 24 కేసులు నమోదయ్యాయి.