మరోవైపు ఇంకో మూడు కేసుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను పీటీ వారెంట్‌పై కస్టడీకి కోరారు అనంతపురం వన్‌టౌన్ పోలీసులు. ఈ నేపథ్యంలో వారు దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ని కోర్టు కొట్టేసింది.
టీడీపీ ముఖ్యనేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు షాక్ తగిలింది. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో ఆయన అరెస్టు అయిన సంగతి తెలిసిందే. కాగా.. వారి బెయిల్ పిటిషన్‌ని కోర్టు కొట్టివేసింది. తమకు బెయిల్ కావాలంటూ వారిద్దరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జేసీ ప్రభాకర్ రెడ్డిని అనంతపురం కోర్టు న్యాయమూర్తి విచారించారు. మరోవైపు ఇంకో మూడు కేసుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను పీటీ వారెంట్‌పై కస్టడీకి కోరారు అనంతపురం వన్‌టౌన్ పోలీసులు. ఈ నేపథ్యంలో వారు దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ని కోర్టు కొట్టేసింది.
కాగా ప్రస్తుతం ఈ ఇద్దరు కడప సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ కేసులో జేసీ దివాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డిని బుధవారం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారించిన విషయం తెలిసిందే.
