టిడిపి డ్రామాలు బయటపడ్డాయి..

నిప్పుతో చెలగాటమా అని నిలదీయండి..హైదరాబాద్ నుండి ఎంపిలకు చంద్రబాబు ఆదేశాలు..

పార్లమెంటులో ప్రధాని, జైట్లీతో సుజనా, రమేష్ మంతనాలు..

ఇవి చంద్రబాబునాయుడు-కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ మధ్య జరుగుతున్న డ్రామాలంటూ వైసిపి మండిపడుతోంది.

అంటే చంద్రబాబు చెబుతున్నది ఒకటి. పార్లమెంటు వేదికగా జరుగుతున్నది మరొకటన్న విషయం తెలిసిపోతోంది. సర్వత్రా ఆసక్తిరేపిన ఆ దృశ్యాల వివరాల్లోకి వెళితే...

వైఎస్సార్‌సీపీతోపాటు ఏడు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు నేడు లోక్‌సభ ముందుకు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇవాళ పార్లమెంట్‌కు వచ్చారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో మాట్లాడుతున్న సమయంలోనే టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌ అటుగా వెళ్లారు.

ప్రధాని, జైట్లీతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఒక దశలో జైట్లీ చేతులు పట్టుకుని సుజనా ఏదో వివరించే ప్రయత్నం చేశారు. ప్రధానికి కూడా నమస్కారం పెట్టారు. ఆసక్తికరమైన ఈ దృశ్యాలపై పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.