అమరావతి: ఏపీ శాసమండలిలో బుధవారం నాడు టీడీపీ ఎమ్మెల్సీలు, మంత్రులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. సీఆర్‌డీఏ రద్దు బిల్లు, ఏపీ పాలన వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టాలని మంత్రులు పట్టుబట్టారు. దీనికి  టీడీపీ ఎమ్మెల్సీలు అడ్డుపడ్డారు.

సీఆర్‌డీఏ రద్దు బిల్లు, ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లులను  అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. ఈ రెండు బిల్లులను మండలిలో ప్రవేశపెట్టాలని మంత్రులు పట్టుబడుతోంది. ఈ రెండు బిల్లులను ఇదివరకే సెలెక్ట్ కమిటికి పంపించిన విషయాన్ని టీడీపీ సభ్యులు గుర్తు చేస్తున్నారు.

also read:మండలికి కీలక బిల్లులు, టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ దూరం: చంద్రబాబు ఫోన్

ఈ రెండు బిల్లులను మండలిలో ప్రవేశపెట్టించేందుకు 15 మంది మంత్రులు ఇక్కడే ఉన్నారు.  ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ పెట్టాలని టీడీపీ సభ్యులు పట్టుబడుతున్నారు.

also read:శాసనమండలికి సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులు: అడ్డుకొనేందుకు టీడీపీ వ్యూహం, ఏం జరుగుతోంది?

అయితే ఏ బిల్లును ప్రవేశపెట్టాలనే దానిపై ఓటింగ్ పెట్టాలని టీడీపీ ఎమ్మెల్సీలు కోరుతున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.
ఇవాళ ఉదయం కూడ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. దీంతో మండలిని  ఛైర్మెన్ వాయిదా వేశారు.

అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత శాసనమండలిలో ఇంగ్లీష్ మీడియంపై  చర్చ జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వానికి కీలకమైన ఈ రెండు బిల్లులను మండలిలో ప్రవేశపెట్టాలని పట్టుబట్టారు.మండలిలో అసలు ఏం జరుగుతోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.