అమరావతి: ఈ నెల 19వ తేదీన కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఆల్ పార్టీ మీటింగ్‌కు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది.

జమిలీ ఎన్నికలు నిర్వహించే విషయమై  కేంద్రం మంగళవారం నాడు అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు.  
ఈ సమావేశానికి హాజరుకావాలని  కేంద్రం అన్ని రాజకీయ పార్టీలకు లేఖలను పంపింది.  అయితే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది.

ఈ సమావేశంలోని ఎజెండా అంశాలపై తమ పార్టీ అభిప్రాయాలను టీడీపీ లేఖ ద్వారా  పంపనుంది.జమిలీ ఎన్నికలు నిర్వహించే విషయమై రాజ్యాంగ, న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని టీడీపీ కేంద్రాన్ని కోరనుంది.