Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తో బాబు, పవన్ భేటీ: బోగస్ ఓట్లపై ఫిర్యాదు


కేంద్ర ఎన్నికల కమిషనర్  రాజీవ్ కుమార్ బృందంతో   తెలుగు దేశం పార్టీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేతలు  పవన్ కళ్యాణ్ ఇవాళ సమావేశమయ్యారు.

TDP Chief Pawan Kalyan and Jana Sena  Chief Pawan Kalyan Meetin with Chief Election Commissioner Rajiv kumar lns
Author
First Published Jan 9, 2024, 11:28 AM IST

విజయవాడ: కేంద్ర ఎన్నికల కమిషనర్  రాజీవ్ కుమార్ నేతృత్వంలోని  ఎన్నికల సంఘం ప్రతినిధులతో  తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు  మంగళవారం నాడు విజయవాడలో భేటీ అయ్యారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్దతపై  అధికారులతో సమీక్షలు నిర్వహించేందుకు  కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం సోమవారం నాడు రాత్రి విజయవాడకు చేరుకుంది.  ఇవాళ, రేపు  అధికారులు, రాజకీయ పార్టీల నేతలతో  సీఈఓ బృందం సమావేశం కానుంది.

ఇవాళ ప్రతి రాజకీయ పార్టీకి  కనీసం  15 నుండి  20 నిమిషాల పాటు  ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది. రాజకీ పార్టీల ఫిర్యాదులపై  ఈసీ అధికారులు  విచారణ నిర్వహించనున్నారు.

also read:వైఎస్ఆర్ మరణంపై నారాయణ స్వామి వ్యాఖ్యలు: హైద్రాబాద్ పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోగస్ ఓట్లు, తప్పుడు చిరునామాలతో  ఓట్ల చేర్పింపు వంటి అంశాలపై  తెలుగు దేశం, వైఎస్ఆర్‌సీపీలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. 2023 డిసెంబర్ మాసంలో  ఈ రెండు పార్టీల  నేతలు న్యూఢిల్లీలో  ఫిర్యాదు చేసుకున్నాయి.  రాష్ట్రంలో  బోగస్ ఓట్ల  విషయంతో పాటు ఇతర అంశాలపై  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు  ఎన్నికల సంఘం ప్రతినిధులకు ఫిర్యాదు చేయనున్నారు.  వాలంటీర్ల సహాయంతో  ఓటర్ల జాబితాలో  మార్పులు చేర్పులు చేస్తున్నారని  తెలుగు దేశం పార్టీ గతంలో  ఆరోపణలు చేసింది.  

also read:తుంటి విరిగిందా: రేవంత్ రెడ్డికి కొడాలి నాని కౌంటర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్  మాసంలో  ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.  ఈ ఎన్నికల సన్నద్దతపై  అధికారులతో  ఎన్నికల కమిషనర్ ఇవాళ సమావేశాలు నిర్వహించనున్నారు.  ఈ సమావేశానికి ముందు  రాజకీయ పార్టీలతో  సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో  తాము లేవనెత్తిన అంశాలపై  ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలను తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios