అనంతపురం:టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  ఇప్పుడు తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న వైసీపీ నేతలకు వడ్డీతో తిరిగి ఇచ్చే బాధ్యత తనదేనని చంద్రబాబునాయుడు పార్టీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

Also read:మా బూట్లు నాకే పోలీసులను తెచ్చుకొంటాం, జగన్ మరో రాజారెడ్డి: జేసీ సంచలనం

అనంతపురం జిల్లాలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గురువారం నాడు రెండో రోజు పర్యటించారు. జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ స్థితిగతులపై ఆయన సమీక్షించారు. 

గురువారం నాడు చంద్రబాబునాయుడు వైసీపీ బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా  చంద్రబాబునాయుడు వైసీపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ నేతలు దున్నపోతుల్లా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. 

వైసీపీ బాధితులకు పార్టీ అండగా ఉంటుందని ఆయన చెప్పారు.  ఏపీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  టీడీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. ఈ విషయాన్ని మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్టుగా ఆయన గుర్తు చేశారు.