Asianet News TeluguAsianet News Telugu

కుప్పంలో టీడీపీ నేతలపై దాడి.. డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...

దాడికి గురైన వారిని ఆస్పత్రిలో చేర్చుతుంటే కూడా అడ్డుపడ్డారని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న Illegal miningను ప్రశ్నించడం వల్లనే దాడి చేశారని తెలిపారు. శాంతి భద్రతలు కాపాడే విధంగా పోలీసు చర్యలు ఉండాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. 

TDP chief Chandrababu's letter to the DGP
Author
Hyderabad, First Published Jan 11, 2022, 10:03 AM IST

అమరావతి : కుప్పంలో టీడీపీ నేతలపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు కోరుతూ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ కు టీడీపీ అధినేత  chandrababu naidu లేఖ రాశారు. దాడికి గురైన వారిని ఆస్పత్రిలో చేర్చుతుంటే కూడా అడ్డుపడ్డారని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న Illegal miningను ప్రశ్నించడం వల్లనే దాడి చేశారని తెలిపారు. శాంతి భద్రతలు కాపాడే విధంగా పోలీసు చర్యలు ఉండాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో వైసీపీ నేతల ఆగడాలు పరాకాష్టకు చేరాయని  టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు 2021 డిసెంబర్ 24న ఆరోపించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న kuppam నియోజకవర్గంలో టిడిపి కార్యకర్త మురళిపై వైసిపి గుండాగిరిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. కుప్పం మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన I-TDP కార్యకర్త మురళీని కిడ్నాప్ చేసిమరీ వైసీపీ నేతలు దాడికి దిగడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు.   

ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే కిడ్నాప్ చేసి కొట్టడమేకాకుండా కాకుండా చంపుతామని బెదిరిస్తున్నారని అన్నారు. మురళిపై దాడిచేసిన నిందితులను తక్షణమే పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు. మురళీకి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. మురళీకి, వారి కుటుంబానికి అన్ని విధాలా టిడిపి అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. 

RESCO చైర్మన్ సెంథిల్ కుమార్ తో పాటు అతని అనుచరులు సీఎం జగన్ రెడ్డి అండ చూసుకుని ప్రశాంతమైన కుప్పంలో అరాచకం సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రశ్నించే వాళ్లు వైసీపీ నేతలకు కనబడకూడదా? రాష్ట్రం మీ జాగీరా..? అని ప్రశ్నించారు. మీ ఉడత ఊపులకు పసుపు సైనికులు బెదిరిపోరని చంద్రబాబు పేర్కొన్నారు. 

YSRCP దుర్మార్గాన్ని, అరాచకాలను ప్రజలు చూస్తున్నారని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ప్రభుత్వ తప్పులను ప్రశ్నించి, నిరసన తెలిపే హక్కు ఉందని... అలా ప్రశ్నించి, విమర్శించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించి రాజ్యాoగం ప్రసాదించిన స్వేచ్ఛా హక్కును కాలరాస్తున్నారని వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ గూండాలు తప్ప మరెవరూ ఉండకూడదని అనుకుంటున్నారు... కానీ వడ్డీతో సహా ఈ అన్యాయాలను, అరాచకాలను తిరిగిచ్చేస్తాం అని చంద్రబాబు హెచ్చరించారు. 

ఇక టిడిపి కార్యకర్య మురళిపై దాడి గురించి వివరిస్తూ నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ కు చంద్రబాబు లేఖ రాసారు. ఆంధ్రప్రదేశ్‌ లో శాంతిభద్రతలు కుప్పకూలి పోతున్నాయని...ప్రతిపక్ష టిడిపి నాయకులు, సానుభూతిపరులపై పదేపదే హింసాత్మక దాడులు పెరిగిపోయాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. ఇంత జరుగుతున్నా పోలీసులు దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం లేదని డిజిపి దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. 

''వైసీపీ నేతలు, గూండాలు ఓ వర్గం పోలీసులతో కుమ్మక్కై ప్రతిపక్ష టీడీపీ నేతల ప్రజాస్వామిక గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కుప్పం ఐ-టీడీపీ సభ్యులు సి. మురళిని 20 డిసెంబర్ 2021 మధ్యాహ్నం అధికార పార్టీ గూండాలు కుప్పం పట్టణంలో కిడ్నాప్ చేసారు. నేరుగా అతడిని రెస్కో చైర్‌ పర్సన్ జిఎస్ సెంధిల్ కుమార్ ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ సెంధిల్ కుమార్ తో పాటు అతని అనుచరులు మురళిపై దాడి చేయడమే కాదు కొట్టి చంపేస్తామని బెదిరించారు'' అని చంద్రబాబు వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios