టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎనలేని కీర్తి సంపదలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను అని చంద్రబాబు ట్వీట్ చేశారు
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలుగు సినీ కథానాయకులు, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. కళాసేవ, ప్రజాసేవ, సామాజిక సేవా కార్యక్రమాలతో అశేష అభిమానుల ఆదరణ చూరగొంటున్న మీరు.. చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలి. ఎనలేని కీర్తి సంపదలతో నిండు నూరేళ్లూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
కాగా, బాలయ్య బర్త్ డే (Balakrishna Birthday)కానుకగా విడుదలైన ఆయన 107వ చిత్ర టీజర్ ఆకట్టుకుంది. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించేదిగా ఉంది. సాధారణ ప్రేక్షకులకు మాత్రం నిరాశ మిగిల్చింది. బాలయ్య గత చిత్రాలన్నీ మిక్స్ చేసి ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. ఆ డైలాగ్స్ కూడా ఆయన గత చిత్రాలను తలపిస్తున్నాయి. మొనాటమి కారణంగానే బాలయ్యకు హిట్ పర్సెంటేజ్ చాలా తక్కువ. ఫలితాల సంగతి ఎలా ఉన్నా తనకు కలిసొచ్చిన జోనర్ వదలకుండా చేస్తున్నాడు బాలయ్య.
మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. క్రాక్ మూవీ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని నుండి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. కాగా బాలయ్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు.
