వైసీపీ నేతలు కర్ర తెస్తే.. తామూ కర్ర తెస్తామని, వాళ్లు ఒక దెబ్బ కొడితే మేము రెండు దెబ్బలు కొడతామని  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. మనుషులంటే కోసుకుని తినే కోళ్లు, మేకలు అనుకుంటున్నారా అంటూ ఫైర్ అయ్యారు.

వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ నేతలు కర్ర తెస్తే.. తామూ కర్ర తెస్తామని, వాళ్లు ఒక దెబ్బ కొడితే మేము రెండు దెబ్బలు కొడతామని చంద్రబాబు హెచ్చరించారు. శనివారం శ్రీకాళహిస్తిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ వివేకా మాదిరిగా గొడ్డలిపోటుకు బలయ్యేందుకు ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు.

వైసీపీ నేతలు ఎంతగా విరుచుకుపడితే.. సైకిల్ స్పీడ్ డబుల్ అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. మనుషులంటే కోసుకుని తినే కోళ్లు, మేకలు అనుకుంటున్నారా.. నేరాల్లోనూ వైసీపీ ప్రభుత్వం పోలీసులను భాగస్వామ్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఒకరిద్దరు అధికారుల కారణంగా మొత్తం పోలీస్ శాఖకే చెడ్డపేరు వస్తోందని.. పోలీసుల్లోనూ తిరుగుబాటు రావాలని చంద్రబాబు కోరారు. 

ALso Read: పుంగనూరు విధ్వంసం.. గెలిచే సత్తా లేక దాడులు, ఆయన చిప్ మార్చుకోవాలి : చంద్రబాబుపై వైసీపీ నేతల ఆగ్రహం

స్థానిక ఎమ్మెల్యే ఐదేళ్లుగా తిన్నదంతా కక్కిస్తానని.. శ్రీకాళహస్తి నుంచే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైందన్నారు. సైకో అన్న పోస్ట్ పెడితే ఈ ఎమ్మెల్యే ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడని చంద్రబాబు నాయుడు దుయ్యబ్టటారు. హైదరాబాద్ మాదరిగానే రాయలసీమలోనూ పరిశ్రమలను తీసుకొచ్చానని ఆయన గుర్తుచేశారు. పీఎల్ఆర్ కంపెనీ పేరుతో పెద్దిరెడ్డి కాంట్రాక్ట్‌లు తీసుకుని వేల కోట్లు దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి కేశినేని నాని లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీలో శాంతిభద్రతల విషయంలో వేగంగా చర్యలు తీసుకుంటే.. రాష్ట్రంలో శాంతి పునరుద్ధరించబడుతుందని అన్నారు. ఇటీవల జరిగిన ఘర్షణలపై సమగ్ర విచారణ జరిపి, హింసను ప్రేరేపించిన వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఆదేశించాలని ప్రధాని మోదీని కోరారు.