ప్రపంచంలో అతిపెద్ద ఉద్యమం అమరావతి ఉద్యమం అన్నారు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. మంగళవారం రాజధాని గ్రామాల్లో పర్యటించిన ఆయన ప్రసంగిస్తూ.. చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం అమరావతిదని అభివర్ణించారు.

మహిళ దినోత్సవం రోజున అమానుషంగా ప్రవర్తించారంటూ పోలీసులపై మండిపడ్డారు. 2013 భూసేకరణ చట్టం కింద రాజధాని కోసం 29000 మంది రైతులు 33,000 ఏకరాల భూమి ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు.

రాజధాని లో ఒకే కులం అన్నారని.. కానీ అమరావతిలో వై యస్ అర్ పార్టీ ని గెలిపెంచారని ప్రతిపక్షనేత  తెలిపారు. హైదరాబాద్‌ను అభివృద్ది చేశానని.. ఇప్పుడు కోవిడ్ టీకా తయారు చేసిన భారత్ బయోటెక్‌ను తానే తీసుకొచ్చానని చంద్రబాబు వెల్లడించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడికి వచ్చారని, కోవిడ్‌కు టీకా తీసుకున్నారని టీడీపీ అధినేత పేర్కొన్నారు. నాడు ఐటీ కి ప్రాధాన్యత ఇచ్చానని.. అమరావతి కొంత మంది కోసం కాదని అందరికి ఉపయోగపడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

అమరావతి తన మానస పుత్రిక అన్న ఆయన.. నేను వేసిన చెట్లుకు నీరు పోయాలేకయారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజా వేదిక కూల్చినందుకు బాధపడ్డానని.. నిన్న జరిగిన సంఘటనపై తీవ్రంగా స్పందించానని చంద్రబాబు తెలిపారు.

బాబాయ్‌ని హత్య చేయడంతో పాటు చెల్లెని మోసం చేసిన జగన్ చరిత్రలో నీచుడిగా మిగిలిపోతాడని బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయం ధర్మమే చివరకు గెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

పోలీసులు చాలా ఎక్కువ చేస్తున్నారు.. ఆ పోలీసులు ఎక్కడ డ్యూటీలు చేసినా వదిలేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి చాలా పిరికి వాడని.. తనను చూసి భయపడుతున్నాడంటూ ఆయన వ్యాఖ్యానించారు.

నన్ను ఇల్లు కట్టు కోలేదని విమర్శించారని.. కానీ జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టి ఏం పికాడంటూ ప్రతిపక్షనేత ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాల పేరుతో రూ.10 వేలు ఇచ్చి రూ.1,00,000 తీసుకుంటున్నారంటూ సెటైర్లు వేశారు.

పాత కేసులే కాదు.. కొత్త కేసులు వస్తాయంటూ చంద్రబాబు ఆరోపించారు. తనను విమానాశ్రయంలో అరెస్ట్ చేయించారని.. తాను కన్నెర్ర చేస్తే జగన్ బయటకు కూడా రాలేడని ఆయన హెచ్చరించారు.

ఏపీలో ఫ్యాక్షనిస్టు ప్రభుత్వం నడుస్తోందని.. జగన్మోహన్‌రెడ్డి పాలనకు పనికి రాడంటూ టీడీపీ అధినేత దుయ్యబట్టారు. అమరావతి కాపాడు కోవడం కోసం చేసే ఉద్యమాని తాను అండగా వుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

రాబడి తక్కువగా వుంటే ఎక్కువ ఖర్చులు చేస్తున్నారంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కి అమరావతే ఎప్పటికీ రాజధానిగా వుంటుందని ఆయన స్పష్టం చేశారు.