తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేడు, రేపు చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్టుగా టీడీపీ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన కొనసాగిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నేడు, రేపు చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్టుగా టీడీపీ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన కొనసాగిస్తున్నారు. ఇందుకోసం చంద్రబాబు ఉదయమే ఏలూరు జిల్లాకు చేరుకున్నారు. అక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు అయోధ్యలంకలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన సాగనుంది. ఈరోజు పి.గన్నవరం, రాజోలు మండలల్లోని పలు గ్రామాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. రేపు పాలకొల్లు, నరసాపురం మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి టీడీపీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇక, గోదావరి వరదల్లో చిక్కుకున్న కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు ఇప్పటికే టీడీపీ నేతలకు, కార్యకర్తలకు సూచించారు. సహాయక శిబిరాల్లో ఉన్న కుటుంబాలను వారి సొంత గ్రామాలకు తరలించడంలో, ప్రజలకు సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొనాలని ఆయన వారికి చెప్పారు. ఇక, ఆకస్మిక వరదలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. వరద నీటిలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్ తాడేపల్లి ఇంట్లోనే ఉండిపోయారని విమర్శించారు. వరదల గురించి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
