Asianet News TeluguAsianet News Telugu

ఏపిని పట్టి పీడిస్తున్న డేంజరస్ వైరస్ జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబునాయుడు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో మంగళవారం నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 175 నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, టిడిపి ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ అన్నం పెట్టే రైతన్నలకు సంకెళ్లు వేసిన రాష్ట్రంగా ఏపికి దేశవ్యాప్తంగా చెడ్డపేరు తెచ్చారు.

TDP chief Chandrababu Naidu video conference with senior leaders - bsb
Author
Hyderabad, First Published Nov 3, 2020, 4:22 PM IST

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో మంగళవారం నారా చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 175 నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, టిడిపి ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ అన్నం పెట్టే రైతన్నలకు సంకెళ్లు వేసిన రాష్ట్రంగా ఏపికి దేశవ్యాప్తంగా చెడ్డపేరు తెచ్చారు.
 
రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ ఆందోళనల ద్వారా వైసిపి రైతాంగ వ్యతిరేక చర్యలను రాష్ట్రవ్యాప్తంగా గర్హించారు. 176చోట్ల గృహ నిర్బంధాల ద్వారా,  దీనిని విఫలం చేయాలని వైసిపి నాయకులు ప్రయత్నించి భంగపడ్డారు. 

వరద ప్రాంతాల్లో అడుగుపెట్టని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరో చరిత్ర సృష్టించాడని ఎద్దేవా చేశారు. గాల్లో తిరిగి చేతులు దులుపుకున్నాడే తప్ప నేలపై అడుగు పెట్టలేదు. రేషన్ సరుకుల పంపిణీకి, ముంపు రోజులకు ముడిపెట్టిన సిఎంగా జగన్మోహన్ రెడ్డి ఇంకో చరిత్ర. వారం రోజులు మునిగితేనే సరుకులు ఇస్తామన్న ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నాం.

వరద బాధితులను పరామర్శించిన టిడిపి నేతలపై తప్పుడు కేసులు పెట్టడం హేయం. రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేసిన జెఏసి నాయకులపై, మహిళలపై దాడిని, అక్రమ కేసులను ఖండిస్తున్నాం. ఉత్తరాంధ్ర, రాయలసీమ తోపాటు 13జిల్లాలకు ప్రాణనాడి, పోలవరంలో వైసిపి ప్రభుత్వం  చేసిన అనేక తప్పులే రాష్ట్రానికి శాపంగా మారాయి. రివర్స్ టెండర్ల పేరుతో పోలవరం పనులు ఆపేశారు. అంచనాల పెంపులో అవినీతి జరిగిందని తప్పుడు ఆరోపణలు చేశారు. వైసిపి చేసిన తప్పులే రాష్ట్రం మెడకు చుట్టుకున్నాయి. 

టిడిపిపై బురద జల్లడంపై శ్రద్ద, పోలవరం పనుల పూర్తిపై పెట్టడం లేదు. కేంద్రాన్ని ఒప్పించి పనులు త్వరితగతిన పూర్తిచేసే దిశగా చర్యలు లేవు. వైఎస్ హయాంలో పోలవరంపై ఖర్చు చేసింది కేవలం రూ 400కోట్లు మాత్రమే.

టిడిపి 5ఏళ్లలో రూ11వేల కోట్లు పోలవరంపై ఖర్చు చేశాం, 71% పనులు పూర్తి చేశాం, నీటిపారుదల ప్రాజెక్టులపై రూ64వేల కోట్లు ఖర్చు చేశాం. భూమినే ఒక జలాశయంగా చేసే భగీరథ ప్రయత్నంలో భాగంగా, భూగర్భ జలాలు పెంచడం, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా జలవనరుల అభివృద్దికి కృషి చేశాం. 

అలాంటిది వైసిపి వచ్చాక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, చింతలపూడి, వైకుంఠపురం, బొల్లాపల్లి రిజర్వాయర్, హంద్రీ-నీవా పనులు అన్ని ప్రాజెక్టుల పనులను ఆపేశారు. రాష్ట్రానికి తీరని నష్టం చేశారు.

పేదల సొంతింటి కల నెరవేర్చడానికి టిడిపి ప్రభుత్వం కృషి. 13జిల్లాలలో 12 లక్షల ఇళ్లు కట్టాం. మంచి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశాం. కట్టిన ఇళ్ల వల్ల టిడిపికి మంచిపేరు వస్తుందనే అక్కసుతో వాటిని నాశనం చేయడమే లక్ష్యంగా వైసిపి పెట్టుకుంది. డిపాజిట్ కట్టిన పేదలకు ఇళ్లు ఇవ్వకుండా వైసిపి నమ్మకద్రోహం చేసింది.

ఇళ్లస్థలాల పంపిణీకి టిడిపి అడ్డుపడుతోందనే వైసిపి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. సెంటుపట్టా స్కీమ్ లో రూ4వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. పట్టాకు రూ 30వేలు, రూ 60వేలు, రూ లక్షా 10వేల చొప్పున ముడుపులు వసూళ్లు చేశారు. ముడుపుల కోసం, వాటాల కోసమే పట్టాల పంపిణీలో వైసిపి నాయకులు జాప్యం చేస్తున్నారు.  కోర్టుకెళ్లి స్టే తెచ్చింది వైసిపి నాయకులే అనేది ప్రజలకు వివరించాలి. 

‘‘నా ఇల్లు-నా స్వంతం, నా స్థలం-నాకు ఇవ్వాలి’’ ప్రజాందోళనలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలి. లబ్దిదారులైన పేద కుటుంబాలకు అండగా ఉండాలి. వాళ్ల ఇళ్లు, వాళ్ల స్వాధీనం అయ్యేదాకా బాధితుల తరఫున పోరాడాలి. 

ఏపిని పట్టి పీడిస్తున్న డేంజరస్ వైరస్ జగన్మోహన్ రెడ్డి.. కరోనాను మించిన వైరస్ జగన్..
 ఫేక్ న్యూస్ నే నిజాలుగా నమ్మింప చేయడంలో జగన్ ఘనుడు. కులం, మతం విద్వేషాలు రగిలించడంలో ఆరితేరినవాడు జగన్ అంటూ మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios