Asianet News TeluguAsianet News Telugu

జగన్ అనే వ్యక్తి కోసం కాదు: తిరుపతి ఎన్నికపై చంద్రబాబు అసహనం

తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. శనివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ అరాచకాలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు.

tdp chief chandrababu naidu slams ysrcp over tirupati by poll ksp
Author
Amaravathi, First Published Apr 17, 2021, 2:24 PM IST

తిరుపతి: తిరుపతి లోకసభ ఉప ఎన్నిక తీరుపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశఆరు. పోలీసులు, అధికారులు, వాలంటీర్లు కుమ్మక్కయి ఎన్నికను ఓ ప్రహసనంగా మార్చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్న ఈ ఎన్నికలు ఎందుకని ఆయన అడిగారు 

స్థానికేతరుడైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో ఎందుకు ఉన్నారని ఆయన ప్రశ్నించారు. తిరుపతిలో స్తానికులు ఓట్లు వేయకుండా అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. పోలీసులు, అధికారులు వైసీపీ కోసం పనిచేస్తున్నారని ఆయన అన్నారు ఇతర ప్రాంతాల నుంచి వేల మంది వస్తే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన అడిగారు సరిహద్దలను మూసేసి తనిఖీలు చేసి పంపించాల్సి ఉండగా చెక్ పోస్టులను పోలీసులు ఎత్తేశారని ఆయన అన్ారు 

బిజెపి నేత శాంతారెడ్డి దొంగ ఓటర్లను పట్టుకున్నారని, దొంగ ఓటర్లను పట్టుకున్న తమ పార్టీ నేతలను అరెస్టు చేశారని, ఇదెక్కడి ప్రజాస్వామ్యమని, ఇతర ప్రాంతాల నుంచి వందల మందిని తీసుకుని వచ్చి పర్యాటకులంటున్నారని ఆయన అన్నారు. వెబ్ కాస్టింగ్ నిర్వహణ ఏమైందని ఆయన అడిగారు. అన్ని అక్రమాలపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు .

అధికారులు పోలీసులు ఉన్నది జగన్ అనే వ్యక్తి కోసం కాదని ఆయన అన్నారు. బందిపోట్లను తలపించే విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చూస్తుంటే వైసీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు 

పోలీసులు, పోలింగ్ సిబ్బంది ఏకపక్షంగా వ్యవహరించారని చంద్రబాబు విమర్సించారు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని వైసీపీ అరచాకాలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. వైసీపీ అక్రమాలపై ఈసీకి ఆధారాలు సమర్పిస్తామని ఆయన చెప్పారు. 

ప్రజాస్వామ్యంపై విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ఆయన చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికను పూర్తి రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర బలగాలు, సిబ్బందితో ఎన్నిక నిర్వహించాలని ఆయన కోరారు 

Also Read:తిరుపతి ఉప ఎన్నిక : అధికార పార్టీ అండతో దొంగ ఓట్లు.. సోము వీర్రాజు సంచలనం..


 

Follow Us:
Download App:
  • android
  • ios