ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ మేరకు పెంచిన విద్యుత్ ధరలు, పన్నుల భారంపై ప్రశ్నిస్తున్న ఓ మహిళ వీడియోను ఆయన ట్వీట్ చేశారు. 

పన్నుల బాదుడు, పెంచిన విద్యుత్ చార్జీలపై ఎమ్మెల్యేలను సైతం నిలదీస్తున్న మహిళల ధైర్యానికి వందనం అంటూ ప్రశంసించారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) . తమ జేబులు గుల్ల చేసిన డబ్బులతోనే సంక్షేమం అంటూ తమను మోసం చేస్తున్న వైనంపై గళమెత్తిన సోదరీమణుల ఆవేదనకు ప్రభుత్వం సమాధానం ఇవ్వగలదా? అని ఆయన నిలదీశారు. ఈ మేరకు ఆదివారం వరుస ట్వీట్లు చేశారు. 

‘‘ జగన్ (ys jagan) జేబు నుంచి ఇచ్చారా...అసలు దోచింది ఎంత? ఇచ్చింది ఎంత? మేము వాటితో బతుకుతున్నామా అంటోన్న ఆడబిడ్డల ప్రశ్నలకు ఈ ప్రభుత్వం ఏమి సమాధానం చెపుతుంది? ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, తాము పడుతున్న కష్టాన్ని వివరిస్తూ ప్రశ్నించిన ఆ సోదరి తెగువ అందరికీ స్ఫూర్తి కావాలి’’.

‘‘ పన్నుల బాదుడు, పెంచిన కరెంట్ చార్జీల పై ఎమ్మెల్యేలను సైతం రోడ్డున నిలదీస్తున్న ఆ మహిళల ధైర్యానికి వందనం. తమ జేబులు గుల్ల చేసిన డబ్బులతోనే సంక్షేమం అంటూ తమను మోసం చేస్తున్న వైనం పై గళ మెత్తిన సోదరీమణుల ఆవేదనకు ప్రభుత్వం సమాధానం ఇవ్వగలదా? ’’ అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. 

Scroll to load tweet…