వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఆయనకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పూలమాల వేసి నివాళులు అర్పించారు

వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఆయనకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు చంద్రబాబు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు , నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, శాసనమండలి సభ్యులు పర్చూరు అశోక్ బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరాం ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్రబాబు, పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు, పార్టీ సీనియర్ నాయకులు దేవినేని శంకర్ నాయుడు, తెనాలి చిన్నా తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ ఆదికవి మహర్షి వాల్మీకి జన్మదినం అందరికీ పర్వదినమన్నారు. నేటి సమాజానికి వాల్మీకి బోధనలు మార్గనిర్దేశనం చేస్తామన్నారు. ప్రజలందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపిన నేతలు.. అధర్మం నుంచి ధర్మం వైపు, అసత్యం నుంచి సత్యసంధత వైపు సమాజాన్ని నడిపించాలన్నదే వాల్మీకి ఆశయమన్నారు. అందుకే మానవుడి జీవితాన్ని సుఖమయం, ఆదర్శవంతం చేసే కుటుంబ, రాజకీయ ధర్మాలను ఎన్నింటినో రామాయణంలో పొందుపరిచారని వారు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహాకవి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించి సాంస్కృతిక ఉత్సవంగా నిర్వహించామని వారు గుర్తుచేశారు. అలాగే వాల్మీకి/బోయ‌ల‌ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపామని... ఆ కృషిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.