Asianet News TeluguAsianet News Telugu

స్టీల్ ప్లాంట్‌పై బుకాయింపులు.. పార్లమెంట్‌లో అడ్డంగా బుక్కయ్యారు: వైసీపీపై బాబు సెటైర్లు

విశాఖకు నీటి ఇబ్బంది లేకుండా తాను ఆనాడు చర్యలు తీసుకున్నానని తెలిపారు ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన నగరంలో రోడ్ షో నిర్వహించారు.

tdp chief chandrababu naidu municipal election campaign in visakhapatnam ksp
Author
Visakhapatnam, First Published Mar 5, 2021, 6:55 PM IST

విశాఖకు నీటి ఇబ్బంది లేకుండా తాను ఆనాడు చర్యలు తీసుకున్నానని తెలిపారు ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన నగరంలో రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరం ద్వారా విశాఖకు నీటిని తీసుకురావాలని భావించానని చెప్పారు. వీలైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లు చేర్చాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు.

ఇప్పుడు పోలవరం పనులు జరగడం లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విజయసాయి సన్నాయి నొక్కులు నొక్కారని.. పోస్కో వాళ్లు తమకు తెలియదని చెప్పాడని బాబు చెప్పారు.

కానీ కేంద్రమంత్రి ప్రకటనతో అడ్డంగా దొరికిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. అప్పుడు తేలు కుట్టిన దొంగల్లాగా పోస్కో వాళ్లు వచ్చినట్లు ఒప్పుకుని, విశాఖలో కాకుండా మరో చోట ప్లాంట్ పెట్టామన్నామంటూ బుకాయించారని టీడీపీ అధినేత ధ్వజమెత్తారు.

ఎంఓయూ సైతం జరిగిపోయిందని.. ఏ1, ఏ2 లకు వాస్తవాలు చెప్పడం తెలియదన్నారు. బాబాయ్‌ని చంపిన వ్యక్తిని పట్టుకోవడం తెలియడం లేదంటూ జగన్‌ని ప్రశ్నించారు. నాడు హత్యపై సీబీఐ విచారణ కోరారని, ఇప్పుడు సీబీఐ దర్యాప్తు అక్కర్లేదని అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా సంజీవని అని చెప్పిన జగన్ ఇప్పుడు ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios