ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన మున్సిపల్ ఎన్నికలు జరిగే చోట్ల ఐదు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు.

కర్నూలు, చిత్తూరు, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాలో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచార షెడ్యూలును తెలుగు తమ్ముళ్లు సిద్ధం చేసినట్లు సమాచారం.

Also Read:మున్సిపల్ ఎన్నికలు: పుంగనూరు బరి నుంచి తప్పుకున్న టీడీపీ, కారణమిదే..?

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు మంచి ఫలితాలనే రాబట్టారు. ఈ జోష్‌తో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని తెలుగుదేశం ప్రయత్నిస్తోంది.

త్వరలో తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్నందున పురపాలక ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకునట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిలో భాగంగా ఈ నెల 4న కర్నూలు జిల్లాలో, 5న చిత్తూరు జిల్లాలో,  6న విశాఖ జిల్లాలో, 7న విజయవాడలో, 8న గుంటూరు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేస్తారు.