విశాఖ ఉక్కు పోరాట కమిటీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ సంపూర్ణ మద్ధతు విశాఖ ఉక్కు కమిటీకి ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. వాజ్‌పేయ్ హయాంలో రూ.4 వేల కోట్లుకు ప్రైవేటీకరించేందుకు సిద్ధపడ్డారని  చంద్రబాబు గుర్తుచేశారు.

విశాఖ ఉక్కు పోరాట కమిటీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ సంపూర్ణ మద్ధతు విశాఖ ఉక్కు కమిటీకి ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. వాజ్‌పేయ్ హయాంలో రూ.4 వేల కోట్లుకు ప్రైవేటీకరించేందుకు సిద్ధపడ్డారని చంద్రబాబు గుర్తుచేశారు. విశాఖ ఉక్కు పోరాటంలో రాజీనామాలకు టీడీపీ ప్రజా ప్రతినిధులకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. కాగా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఆందోళన తీవ్రతరం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్ధితుల్లో చంద్రబాబు లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖ ఉక్కు పరిరక్షణకు సీఎం జగన్ నేతృత్వం వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని సీఎం జగన్ ముందుండి నడిపించడం ఎంతో అవసరమన్నారు. ఐక్య పోరాటం వల్లే ఉక్కును ప్రైవేటీకరించకుండా కాపాడగలమని చంద్రబాబు అన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred