Asianet News TeluguAsianet News Telugu

నా లాయర్లను లోపలికి అనుమతించండి : సిట్‌ దర్యాప్తు అధికారికి చంద్రబాబు లేఖ

సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.  సీఐడీ కార్యాలయంలో ప్రక్రియ పూర్తయిన తర్వాత చంద్రబాబును జీజీహెచ్‌కు తరలించి అక్కడ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

tdp chief chandrababu naidu letter to sit officials ksp
Author
First Published Sep 9, 2023, 6:44 PM IST

సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తన తరపు లాయర్లను లోనికి అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీఐడీ కార్యాలయంలో ప్రక్రియ పూర్తయిన తర్వాత చంద్రబాబును జీజీహెచ్‌కు తరలించి అక్కడ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరు పరచనున్నారు. చంద్రబాబు తరఫును సుప్రీం కోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. ఇందుకోసం సిద్దార్థ లూథ్రా ఇప్పటికే ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

మరోవైపు ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. చంద్రబాబును రిమాండ్‌కు ఇవ్వాల్సిందిగా కోరనున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి సీఐడీ సమర్పించిన ఆధారాలు, ఇరువైపుల వాదనల అనంతరం.. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలా? వద్దా? అనే దానిపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు. 

Also Read: పవన్‌కు షాక్.. కృష్ణా జిల్లా పోలీసుల విజ్ఞప్తి , బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో జనసేనాని ఫ్లైట్ నిలిపివేత

కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. నంద్యాల పట్టణంలోని జ్ఞానాపురంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నంద్యాలలో హైడ్రామా నెలకొంది. ఆయన అరెస్టు కోసం సీఐడీ అధికారులు రాత్రికి 2.30 గంటలకు ఫంక్షల్ హాల్ వద్దకు చేరుకున్నప్పటికీ.. ఉదయం 6 గంటలకు అరెస్టు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios