జగన్ మన రాష్ట్రానికి పట్టిన దరిద్రమని.. ఆయన పోతేనే పిల్లలకు భవిష్యత్తని లేదంటే అంధకారమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంకొద్ది నెలల్లో సైకో పోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బుధవారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చివరి ఏడాది, ఇంకొన్ని నెలలే, సైకో పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇల్లు మీది స్టిక్టర్ సైకోది, మధ్యలో ఆయన పెత్తనం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంటి ఓనర్ పర్మిషన్ లేకుండా స్టిక్కర్లు అతికించడం చట్ట వ్యతిరేకమని టీడీపీ అధినేత చెప్పారు. జగన్ మన రాష్ట్రానికి పట్టిన దరిద్రమని.. ఆయన పోతేనే పిల్లలకు భవిష్యత్తని లేదంటే అంధకారమేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. బాబాయ్‌ని చంపి గుండెపోటు, రక్తపోటని చెప్పారని తన పేరు తీసుకుని రావాలని చూశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు పెంచారని.. కరెంట్ ఛార్జీలు సైతం పెంచారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మీ బిడ్డ కాదని.. క్యాన్సర్ గడ్డంటూ టీడీపీ అధినేత సెటైర్లు వేశారు.
అంతకుముందు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణలపై విమర్శలు గుప్పించారు నందమూరి లక్ష్మీపార్వతి. చంద్రబాబు సైకో అని విమర్శించారు. ఆయన పాపాలు పండిపోయాయని అన్నారు. ఆయన విదేశాల్లో 5 లక్షల కోట్లు దాచి పెట్టారని ఆరోపించారు. ఈ నల్లధనం స్వదేశానికి తెప్పించాలని మోదీని కోరుతున్నట్టుగా చెప్పారు. టీడీపీ రోజురోజుకు దిగజారి పోతుందని విమర్శించారు. టీడీపీ సోషల్ మీడియాలో పనికి మాలిన వెధవలను పోషిస్తుందని.. మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తుందని ఆరోపించారు. లోకేష్ పాదయాత్ర కామెడీ సీన్‌లను తలపిస్తుందని విమర్శించారు. బాలకృష్ణ ఏమి మాట్లాతారో తెలియదని.. ఆయన మాట్లాడి ఆరునెలలు అయినా అర్థం కాదని సెటైర్లు వేశారు.
