ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు మండిపడ్దారు. సోమవారం కడప జిల్లాలో పర్యటించిన ఆయన... టీడీపీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీని అణచివేయాలని చూస్తున్నారని... జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులను తన రాజకీయ జీవితంలో ఎంతోమందిని చూశానని చంద్రబాబు ధ్వజమెత్తారు.

జగన్‌కు దెబ్బలు తగిలినా.. గుణపాఠం నేర్చుకోవడం లేదని, రాష్ట్రంలో దుర్మార్గపు, రాక్షస పాలన సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. కేసులతో భయపెడతామంటే అది మీ భ్రమేనని.. టీడీపీ కార్యకర్తల ఆర్ధిక మూలాలను దెబ్బతీయాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు

Also Read:నిన్నొదలా: ఎస్ఐపై జగన్ దాడి, గతాన్ని కెలుకుతున్న పవన్

తాము కూడా ఇదే పంథాలో వెళితే మీరు ఉండేవారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం బాగుండాలని రాత్రింబవళ్లు పనిచేశానని.. ప్రజల బాగు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టామని చంద్రబాబు గుర్తు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది జనసేన పార్టీ. ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని వైసీపీ ప్రభుత్వానికి అంటగడుతూ నానా హంగామా చేస్తోంది. 

సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ అధినేత వైయస్ జగన్ 100 రోజుల పాలనపై అన్ని పార్టీలు స్పందిస్తే పవన్ కళ్యాణ్ 100 రోజుల పాలనతోపాటు 6 నెలల పాలనను సైతం తీవ్రంగా విమర్శించింది.

జగన్ ఆరునెలల పాలాన్ని ఆరు అంశాలతో పోలుస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విమర్శలకు దిగారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ సైతం ఆరు నెలల పాలనపై ఎలాంటి విమర్శలు చేయలేదు కానీ జనసేనాని మాత్రం గొంతెత్తి మరీ విమర్శించాడు. 

Also Read:చంద్రబాబు అమరావతి పర్యటనకు రైతుల నుంచి చుక్కెదురు

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చూస్తుంటే అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా జనసేన వ్యవహరిస్తోందంటూ వార్తలు సైతం వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలను టీడీపీ కంటే జనసేన పార్టీయే ముందుగా ఖండిస్తూ నిరసనలకు దిగడమే అందుకు నిదర్శనం. 

తాజాగా 1994లో జరిగిన ఓ అంశాన్ని తెరపైకి తెచ్చి జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్.  పౌర హక్కుల సంఘం రాసిన కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం పుస్తకంలో వైయస్ జగన్ ప్రస్తావన ఉన్న పేజీని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  

మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది రాయల సీమ లోనేనని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కర్నూలులోని ఒక రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని ,14 ఏళ్ల ‘సుగాలి ప్రీతి ‘ ఉదంతమే అందుకు ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చారు.