నలుగురు నాయకులు పార్టీ మారినంత మాత్రాన నష్టం లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాజ్యసభ సభ్యులు పార్టీ మారడంతో పాటు శుక్రవారం జరిగిన పరిణామాలపై ఆయన పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలతో మాట్లాడుతూ.. పార్టీ మారుతున్న నేతలు భవిష్యత్‌లో పశ్చాత్తాపం పడాల్సి వస్తుందన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి నెలకాక ముందే బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని చంద్రబాబు మండిపడ్డారు.

టీడీపీలో చీలికలు తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని.. పార్టీకి కార్యకర్తలే రక్షాకవచమని బాబు స్పష్టం చేశారు. 37 ఏళ్ల చరిత్రలో ఎన్నో ఎన్నో సంక్షోభాలు చేశామని.. క్యాడర్ అధైర్యపడొద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా విలీనం జరగడంపై రాజ్యసభ ఛైర్మన్‌కు లేఖ రాయాలని భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది.