రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసన.. పిలుపు ఇచ్చిన చంద్రబాబు
రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీడపీ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఇంధన ధరలపై వ్యాట్‌ను పూర్తిగా రద్దు చేసి సీఎం జగన్ మోహన్ రెడ్డి తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు(ఒక గంటపాటు) రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్‌లలో నిరసనలు చేయాలని చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు.
అమరావతి: ఇంధన ధరలపై పోరాడటానికి టీడీపీ నిర్ణయించింది. Petrol, Diesel ధరలపై VAT తగ్గించాలని డిమాండ్ చేస్తూ TDP రాష్ట్రవ్యాప్తంగా Protest చేయడానికి సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్‌ల వద్ద మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు నిరసనలు చేపట్టాలని టీడీపీ చీఫ్ Chandrababu Naidu పార్టీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.
అధికారంలోకి రాకముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ఆ తర్వాత విస్మరించారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. కానీ, అటు తర్వాత ఈ హామీని పట్టించుకోలేదు అని విమర్శించారు. హామీ ప్రకారం, పెట్రోల్‌పై రూ. 16, డీజిల్ పై రూ. 17 తగ్గించాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల్లో చమురు ధరలను తగ్గించినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అటువైపుగా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఇంధన ధరలు తగ్గించడంలో రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మొండి చేయి చూపిందని చెప్పారు. జగన్ రెడ్డి అవినీతి, దుబారా, చేతకాని పరిపాలనా విధానాలతో పెట్రోల్, డీజిల్
ధరలు పెంచారని ఆరోపణలు చేశారు.
Also Read: లీటర్ పెట్రోల్‌పై అదనంగా రూ. 10 తగ్గింపు.. పంజాబ్ ప్రభుత్వ ప్రకటన
పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రానికి పరిశ్రమలు రావని చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటప్పుడు ఉపాధి అవకాశాలూ సన్నగిల్లుతాయని వివరించారు. అంతేకాదు, అధిక డీజిల్ ధరల కారణంగా ట్రాక్టర్, నూర్పిడి ఖర్చులు పెరిగి వ్యవసాయం దెబ్బ తింటుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు, లారీ యజమానులు, కార్మికులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులపైనా తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. చమురు ధరల కారణంగా రవాణా ఖర్చు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలూ తారాస్థాయికి చేరుతాయని వివరించారు. ప్రభుత్వ దోపిడీ, దుబారాల వల్లే పెట్రో భారం పడుతున్నదని ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయని అన్నారు. కరోనా కష్టాల్లో ఉన్న కుటుంబాలపై పెట్రో భారం పిడుగుపాటు అని
తెలిపారు.
Also Read: ఢిల్లీలో ధర్నా చేయండి, మద్దతిస్తా: పెట్రోల్ ధరల తగ్గింపుకై బీజేపీ నేతలకు పేర్ని సలహా
దేశవ్యాప్తంగా కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలనంటాయి. క్రమంగా పెరుగుతూ సెంచరీని దాటాయి. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. డీజిల్ ధరలు కూడా అనూహ్యంగా పెరిగాయి. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీకి చమురు ధరల పెరుగుదల తీవ్ర సమస్యగా పరిణమించింది. ఈ నేపథ్యంలోనే దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను తగ్గిస్తూ సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం వెల్లడించగానే కనీసం పది బీజేపీ పాలిత రాష్ట్రాలూ అదే దారిలో వెళ్లాయి. కేంద్ర ప్రభుత్వ తగ్గింపునకు అదనంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. తాజాగా, నిన్ననే పంజాబ్ ప్రభుత్వం వ్యాట్ తగ్గిస్తూ చమురు ధరలను తగ్గించింది.