జీవీఎంసీ ఎన్నికలు: టీడీపీ అభ్యర్ధి ఇతనే.. రోడ్ షోలోనే ప్రకటించిన చంద్రబాబు

గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్ధిగా పీలా శ్రీనివాసరావును ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలని ఎంతో కృషి చేశానని తెలిపారు

tdp chief chandrababu announced mayor candidate for GVMC election

గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్ధిగా పీలా శ్రీనివాసరావును ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలని ఎంతో కృషి చేశానని తెలిపారు.

హుద్‌హుద్‌ తుపాను వచ్చినప్పుడు విశాఖలోనే 10 రోజులు ఉన్నట్లు చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నగరంలో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చాకే తిరిగి వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 

విశాఖలో పీలా శ్రీనివాస్‌ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ఎన్నికల్లో టీడీపీకి బ్రహ్మాండమైన గెలుపును అందించాలని ఆయన ప్రజలను కోరారు.  పోలవరం ద్వారా విశాఖకు నీటిని తీసుకురావాలని భావించానని చెప్పారు.

వీలైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లు చేర్చాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఇప్పుడు పోలవరం పనులు జరగడం లేదన్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విజయసాయి సన్నాయి నొక్కులు నొక్కారని.. పోస్కో వాళ్లు తమకు తెలియదని చెప్పాడని బాబు చెప్పారు. కానీ కేంద్రమంత్రి ప్రకటనతో అడ్డంగా దొరికిపోయారని ఆయన ఎద్దేవా చేశారు.

అప్పుడు తేలు కుట్టిన దొంగల్లాగా పోస్కో వాళ్లు వచ్చినట్లు ఒప్పుకుని, విశాఖలో కాకుండా మరో చోట ప్లాంట్ పెట్టామన్నామంటూ బుకాయించారని టీడీపీ అధినేత ధ్వజమెత్తారు. ఎంఓయూ సైతం జరిగిపోయిందని.. ఏ1, ఏ2 లకు వాస్తవాలు చెప్పడం తెలియదన్నారు.

బాబాయ్‌ని చంపిన వ్యక్తిని పట్టుకోవడం తెలియడం లేదంటూ జగన్‌ని ప్రశ్నించారు. నాడు హత్యపై సీబీఐ విచారణ కోరారని, ఇప్పుడు సీబీఐ దర్యాప్తు అక్కర్లేదని అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా సంజీవని అని చెప్పిన జగన్ ఇప్పుడు ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios