ఊహించని ట్విస్ట్.. ప్రధాన నిందితుడిగా చంద్రబాబు..
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును ప్రధాన నిందితుడిగా సీఐడీ చేర్చింది. ఏ37గా ఉన్న చంద్రబాబును ఏ1గాసీఐడీ మార్చింది. అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ పీవీ రమేశ్ స్టేట్ మెంట్ ఆధారంగా చంద్రబాబును ఏ1 ప్రధాన నిందితుడిగా మార్చినట్టు తెలుస్తుంది. అలాగే.. ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్టును సమర్పించారు. 2021 ఎఫ్ఐఆర్‌లో లేని చంద్రబాబు పేరు. తాజాగా ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు చేర్చి రిమాండ్ రిపోర్టు ఇచ్చారు.