నాలుగో విడత పంచాయతీ పోరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారాపల్లిలో తెలుగుదేశం పట్టు నిలుపుకుంది. నారావారిపల్లి వున్న కందులవారి పల్లె పంచాయతీలో టీడీపీ బలపరిచిన శ్రీలక్ష్మీ గెలుపొందారు. ఆమె 563 ఓట్ల తేడాతో గెలిచారు.
నాలుగో విడత పంచాయతీ పోరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారాపల్లిలో తెలుగుదేశం పట్టు నిలుపుకుంది. నారావారాపల్లి వున్న కందులవారి పల్లె పంచాయతీలో టీడీపీ బలపరిచిన శ్రీలక్ష్మీ గెలుపొందారు. ఆమె 563 ఓట్ల తేడాతో గెలిచారు.
చంద్రబాబు కంచుకోట కుప్పం నియోజవర్గంలో పంచాయతీ ఫలితాలు టిడిపి, వైసీపీ వర్గాల్లో సంచలనంగా మారుతున్నాయి. మూడో దశ ఎన్నికల్లో కుప్పంలో 89 పంచాయతీల్లో 75 వైసీపీ గెలిస్తే, టీడీపీ కేవలం 13 మాత్రమే గెలిచింది.
ఈ షాకింగ్ పలితాలు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ముఖ్యంగా చంద్రబాబుకు తిరుగులేదనుకున్న చోట టీడీపీ 13 చోట్లకే పరిమితం అవ్వడం చూసి.. చిత్తూరు జిల్లా తమ్ముళ్ళు, టీడీపీ అధినేత అవాక్కయారు కూడా.. ఆ ఫలితాలపై ఇప్పటికే పలుమార్లు రివ్యూ చేశారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో కందులవారిపల్లెపై ఫోకస్ పెట్టిన ఆయన ఎక్కడా పోరపాటుకు తావు ఇవ్వలేదు.
