ఆ ఎమ్మెల్యేకి మళ్లీ టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం: చంద్రబాబుకు అల్టిమేటం

First Published 11, Jan 2019, 4:54 PM IST
tdp cader opposes to mla sravan kumar
Highlights

తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ కు సొంతపార్టీలోనే ప్రతిపక్షం తయారైంది. తాడికొండ నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు ఆయనపై తిరుగుబాహుటా ఎగురవేశారు. దీంతో తన సొంత నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితి నెలకొన్నట్లైంది శ్రావణ్ కుమార్ కి. 

గుంటూరు: తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ కు సొంతపార్టీలోనే ప్రతిపక్షం తయారైంది. తాడికొండ నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు ఆయనపై తిరుగుబాహుటా ఎగురవేశారు. దీంతో తన సొంత నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితి నెలకొన్నట్లైంది శ్రావణ్ కుమార్ కి. 

ఇప్పటికే పలువురు టీడీపీ దళిత నేతలు శ్రావణ్ తీరుపై బాహటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. శ్రావణ్‌కుమార్ గెలుపు కోసం కృషి చేసిన వారిని విస్మరించారని ఆరోపిస్తున్నారు. శ్రావణ్ గెలుపుకోసం పనిచేసిన వారిని గౌరవించకపోగా వారిపై కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు.  

తాడికొండ నియోజకవర్గంలో శ్రావణ్ కుమార్ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని మండిపడుతున్నారు. దళితులను మోసం చేశారని, వచ్చే ఎన్నికల్లో శ్రావణ్ కుమార్‌కు టీడీపీ అదిష్టానం టికెట్‌ ఇవ్వొద్దని చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారు. 

స్థానికులకు ఎమ్మెల్యే టికెట్‌ కేటాయిస్తే గెలిపించుకుంటామని, ఒకవేళ స్థానికుల అభిప్రాయాలను కాదని శ్రావణ్‌ను అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయనను కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు. 

loader