మొత్తానికి వైసీపీ ఎంఎల్ఏ రోజాపైకి టిడిపి కొత్తగా ఓ అస్త్రాన్ని సిద్దం చేసుకుంది. ఎందుకంటే, రోజా వాగ్దాటిని అడ్డుకునేందుకు టిడిపిలో ఇపుడున్న వాళ్ళెవరూ సరిపోలేదనుకున్నట్లున్నారు. పాయకరావుపేట ఎంఎల్ఏ అనిత రోజాకు గట్టిగానే సమాధానం ఇస్తున్నా సరిపోవటం లేదని చంద్రబాబునాయుడు అనుకున్నారేమో.  అందుకనే రోజా పాత ప్రత్యర్ధి శోభారాణిని పార్టీలోకి చేర్చుకున్నారు.

మొత్తానికి వైసీపీ ఎంఎల్ఏ రోజాపైకి టిడిపి కొత్తగా ఓ అస్త్రాన్ని సిద్దం చేసుకుంది. ఎందుకంటే, రోజా వాగ్దాటిని అడ్డుకునేందుకు టిడిపిలో ఇపుడున్న వాళ్ళెవరూ సరిపోలేదనుకున్నట్లున్నారు. పాయకరావుపేట ఎంఎల్ఏ అనిత రోజాకు గట్టిగానే సమాధానం ఇస్తున్నా సరిపోవటం లేదని చంద్రబాబునాయుడు అనుకున్నారేమో. 

అందుకనే రోజా పాత ప్రత్యర్ధి శోభారాణిని పార్టీలోకి చేర్చుకున్నారు. శోభారాణి అంటే హటాత్తుగా ఎవరో చాలామందికి గుర్తుకు రాకపోవచ్చు. అదేనండి ప్రజారాజ్యం పార్టీలో మహిళారాజ్యం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసారు గుర్తుకు వచ్చిందా? ఆవిడే లేండి, తాజాగా గుంటూరులో శుక్రవారం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

అప్పట్లో పిఆర్పీ తరపున శోభారాణి, టిడిపిలో రోజా ఉన్నపుడు ఇద్దరూ తెగ తిట్టేసుకునే వాళ్ళు. ఒక్కోసారి స్ధాయిని కుడా మరచిపోయి తిట్టుకున్న రోజులున్నాయి. ఇంతకాలం తెరమరుగైపోయిన శోభ, ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న సమయంలో మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. మరి, చూడాలి ఈసారేం జరుగుతుందో. అన్నట్లు రోజాకు వ్యతిరేకంగా మళయాళ నటి వాణి విశ్వనాధ్ టిడిపిలో చేరుతున్నట్లు బాగా ప్రచారం జరిగింది. మరి ఏమైందో ఏమో హటాత్తుగా శోభారాణి టిడిపిలో చేరారు.