విజయవాడ మేయర్ అభ్యర్ధిగా కేశినేని శ్వేత: టీడీపీ
విజయవాడ మేయర్ అభ్యర్ధిని టీడీపీ ప్రకటించింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత పేరును మేయర్ అభ్యర్ధిగా టీడీపీ ప్రకటించింది. టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ మేరకు గురువారం నాడు ఓ ప్రకటనను విడుదల చేశారు.
అమరావతి: విజయవాడ మేయర్ అభ్యర్ధిని టీడీపీ ప్రకటించింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత పేరును మేయర్ అభ్యర్ధిగా టీడీపీ ప్రకటించింది. టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ మేరకు గురువారం నాడు ఓ ప్రకటనను విడుదల చేశారు.
కేశినేని శ్వేత విజయవాడలోని 11వ డివిజన్ నుండి బరిలో నిలిచారు. శ్వేత పేరును మేయర్ అభ్యర్ధిగా ప్రకటించవద్దని అదే పార్టీకి చెందిన కొందరు నేతలు అభ్యంతరం తెలిపారు.
నగరంలోని కొన్ని డివిజన్లలో అభ్యర్ధుల ఎంపిక విషయంలో కేశినాని నానికి, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ మహేశ్వర రావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరాకు మధ్య వివాదాలున్నాయి.
ఈ విషయమై పార్టీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకొన్నారు. వ్యక్తిగతంగా కూడ విమర్శలకు దిగారు. ఈ విషయమై చంద్రబాబునాయుడు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
గత నెల చివరి వారంలో విజయవాడ నేతలను పార్టీ కార్యాలయానికి పిలిపించి చంద్రబాబునాయుడు చర్చించారు. అంతేకాదు ఎంపీ కేశినేని నానితో కూడ ఆయన ఫోన్ లో మాట్లాడారు. దీంతో నేతలు చల్లబడ్డారు.
విజయవాడ కార్పోరేషన్ మేయర్ పదవిని దక్కించుకోవాలని టీడీపీ పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యేలు తక్కువ ఓట్లతో ఓటమి పాలయ్యారు. విజయవాడ ఎంపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకొంది.