కడప జిల్లా పరిషత్ సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది.. జిల్లాలో కరువుపైనా, కృష్ణా జలాల పైనా చర్చించాలంటూ వైసీపీ సభ్యులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.. ఛైర్మన్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు పట్టించుకోలేదు.. ఛైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు..

అక్కడితో ఆగకుండా వేదికపైన మంత్రులకు కేటాయించిన కుర్చీల్లో వైసీపీ ఎమ్మెల్యేలు కూర్చొన్నారు. అదే సమయంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి అక్కడికి వచ్చారు. వారి హోదాకు కనీస మర్యాద ఇవ్వకుండా.. లేచి నిల్చోలేదు.. దీంతో వేదికపైన పరిస్థితి చూసి సోమిరెడ్డి బయటకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.