ద్రోహులంతా ఏకమవుతున్నారు..ఎంఎల్ఏ సంచలన వ్యాఖ్యలు

First Published 17, Mar 2018, 12:44 PM IST
TDP alleges all traitors are uniting against development
Highlights
  • కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయలేని కారణంగానే తమ పార్టీ ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసినట్లు చెప్పారు.

తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి రాష్ట్రద్రోహులంతా ఒకటవుతున్నట్లు టిడిపి ఎంఎల్ఏ, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు జివి ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయలేని కారణంగానే తమ పార్టీ ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసినట్లు చెప్పారు.

5 కోట్ల తెలుగు ప్రజల కోసం, వారి ప్రయోజనల కోసం టీడీపి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. టీడీపి ప్రభుత్వం నూరు శాతం ఆంధ్రరాష్ట్ర ప్రజాల, తెలుగు ప్రజల ఆకాంక్షలకు కట్టుబడి ఉందని చెప్పారు. జగన్ తో దొంగాట ఎవరి మేలు కోసమో ప్రజలు గ్రహించాల్సిన సమయం వచ్చిందని ఆంజనేయులు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయ్.

loader