తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉద్రిక్త పరిస్ధితి ఏర్పడింది. నివాళులర్పించేందుకు వచ్చిన లక్ష్మీపార్వతి అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా టీడీపీ కార్యకర్తలు ఆమె ప్రసంగానికి అడ్డు తగిలారు.

ఎన్టీఆర్ వర్ధంతి ఏర్పాట్లను సరిగా చేయలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు ఓటమితో ఎన్టీఆర్ ఆత్మ శాంతించిందని లక్ష్మీపార్వతి తెలిపారు. ఐదేళ్ల పాలనలో బాబు చేసిన తప్పులను జగన్ సరిదిద్దుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.