విశాఖ ఉక్కు కర్మాగారంపై టాటాల కన్ను..
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా పావులు కదుపుతోంది. ఇప్పటికే పలు బడా కంపెనీలు ఈ ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందులో టాటా స్టీల్ ముందు వరుసలో వున్నట్లుగా తెలుస్తోంది
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా పావులు కదుపుతోంది. ఇప్పటికే పలు బడా కంపెనీలు ఈ ప్లాంట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందులో టాటా స్టీల్ ముందు వరుసలో వున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని టాటా స్టీల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ నిర్థారించారు. ప్రస్తుతం విశాఖలో వున్న కర్మాగారం కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. దేశంలో సముద్ర తీరాన వున్న అతిపెద్ద ఉక్కు కర్మాగారంగా దీనికి ప్రత్యేకత వుంది.
దక్షిణాన, మరియు తూర్పు తీర ప్రాంతంలో ఉన్న ఈ ఉక్కు కర్మాగారానికి అనేక అదనపు విశేషణాలు, తద్వారా పలు ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారానికి, దేశీయ అవసరాలను తీర్చేందుకు తగ్గట్లుగా రైలు, రహదారుల సౌకర్యాలున్నాయు. దానితో పాటు, ఇప్పటికే ఆగ్నేసియా మార్కెట్లతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న “టాటా స్టీల్” కు ఆయా మార్కెట్ల కు మరింతగా చేరువయ్యేందుకు సముద్ర తీరంలో ఉన్న విశాఖ ఉక్కు ప్రయోజనకరం గా ఉండనుంది.
22 వేల ఎకరాలలో ఉన్న విశాఖ ఉక్కు కర్నాగారంలోని 100 శాతం కేంద్ర ప్రభుత్వ వాటాలను అమ్మాలని గత జనవరి 27 వ తేదీన “ఆర్ధిక వ్యవహరాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. మొత్తం 6 ప్రభుత్వరంగ సంస్థల వాటాలున్న ఒడిస్సా లోని “నీలాంచల్ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్” ( NINL) ను కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఇప్పటికే (“ఎక్సప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్”) ఆసక్తి ని తెలియజేసింది.