రూ.70 లక్షల విలువైన ఆస్తి టీటీడీకి విరాళం.. తమిళనాడు భక్తురాలి దాతృత్వం..
తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రెండంతస్తుల భవనాన్ని టీటీడీకి రాసిచ్చింది ఓ భక్తురాలు. సోమవారం నాడు ఈ ఘటన జరిగింది.
తిరుపతి : తమిళనాడుకు చెందిన ఓ భక్తురాలు సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందజేశారు. తన తలిదండ్రులు జ్ఞాపకార్థం రూ.70లక్షల విలువైన ఆస్తిని దేవస్థానానికి దానం చేశారు. ఎన్ కె నేమావతి అనే మహిళ నర్సుగా చేసి పదవీవిరమణ పొందింది. ఆమె కొత్తగా నిర్మించిన రెండంతస్తుల భవనాన్ని టీటీడీకి విరాళంగా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ పక్కనుండే తమిళనాడు రాష్ట్రం, తిరువళ్లురు జిల్లా, పల్లిపట్టు తాలూకా, కోడివలస గ్రాములోని దాదాపు 1600స్వ్కేర్ ఫీట్ విస్తీర్ణంలో ఈ భవనం ఉంది. రెండంతస్తుల్లో ఈ భవనాన్ని కొత్తగా నిర్మించారు. దీని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.70 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ భక్తురాలు తన బంధువులతో కలిసి సోమవారం తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ జీ మల్లికార్జునను కలిశారు. ఈ మేరకు తాము విరాళం ఇవ్వాలనుకున్న ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రర్డ్ డాక్యుమెంట్లను, ఇంటి తాళాలను వారికి అప్పగించారు.
వైవీకి పార్టీ బాధ్యతలు, టీటీడీ చైర్మెన్ గా భూమన : సంక్రాంతి తర్వాత ప్రమాణం