తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మంగళవారం ఉదయం తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. అంతకుముందు ఆలయం వ‌ద్ద‌కు చేరుకున్న పళనిస్వామికి టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగతం పలికారు.

స్వామివారి ద‌ర్శ‌నానంతరం  వకుళామాతను, ఆలయ ప్రదక్షిణగా వచ్చి శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగనరసింహస్వామివారిని పళనిస్వామి దర్శించుకున్నారు.

అనంతరం రంగనాయకుల మండపంలో తమిళనాడు ముఖ్యమంత్రికి వేద‌పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఈవో స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ జగన్ మోహనాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.